లొంగిపోయిన నిర్మాత బండ్ల గణేశ్
హైదరాబాద్ : బాద్‌షా సినిమా నిర్మాత బండ్ల గణేశ్ ఈరోజు రాజేంద్రనగర్ కోర్టులో లొంగిపోయారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలయ్యారు. ఇటీవల బాద్‌షా సినిమా పాటల విడుదల వేడుక సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. దాంతో కార్యక్రమ నిర్వహకుడైన బండ్లగణేశ్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదవడంతో ఆయన స్వచ్చందంగా లొంగిపోయారు. తొక్కిసలాటలో మరణించిన వ్యక్తి కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని గణేశ్ తెలిపారు.