లోక్‌పాల్‌ బిల్లు ప్రవేశం

న్యూఢిల్లీ: లోక్‌పాల్‌ బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే రాజ్యసభల ప్రవేశపెట్టే అవకాశం ఉండని కేంద్రం తెలిపింది. పర్లమెంటు ఎంపిక సంఘం లోక్‌పాల్‌ బిల్లుపై సెప్టెంబరు 3 లోగా తన నివేదికను సమర్పిస్తుందని భావిస్తున్నాం. ఒకవేళ అలా జరిగితే బిల్లును సభలో ప్రవేశపెడతాం అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పవన్‌కుమార్‌ బన్సల్‌ గురువారమిక్కడ విలేకర్లతో చెప్పారు. మొత్తం 118 బిల్లులు వివిధ దశల్లో ఉన్నాయని వీటిలో స్థాయీ సంఘాల సిఫార్సుట మీద ఆధారపడినవే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.