లోక్‌సభను కుదిపేసిన ఆప్ ఎంపీ వివాదం

KPN photoఆమ్ ఆద్మీ ఎంపీ భగవత్‌ మన్‌ సింగ్ వీడియో వివాదం లోక్‌ సభను కుదిపేసింది. పార్లమెంట్ భద్రతను పణంగా పెట్టే విధంగా పార్లమెంట్‌లో వీడియో తీశారని ఎన్డీఏ ఎంపీలు ఆరోపించారు. సభ ప్రారంభం కాగానే ఇదే అంశాన్ని బీజేపీ, ఎన్డీఏ ఎంపీలు ప్రస్తావించారు. ఆమ్ ఆద్మీ ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. స్పీకర్‌ ఎంతగా నచ్చచెప్పిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఎంపీలు పట్టుబట్టటంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.