లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి.
విజయనగరం, ఆగస్టు 3 : ఈ నెల 4,5 తేదీల్లో జరిగే లోక్ అదాలత్‌లను కక్షిదారులు సద్వినియోగపర్చుకోవాలని చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి పి.వి.రాంబాబు తెలిపారు. మండల న్యాయసేవా సమితి పార్వతీపురం వారి ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో నిర్వహించే చెక్‌బౌన్స్‌కు సంబంధించిన కక్షిదారులు పాల్గొని లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న వాటి శాశ్వత పరిష్కారం జరిగేలా ప్రత్యేక లోక్ అదాలత్‌లో తీర్పు ఇస్తుందన్నారు.