లోక్‌ సభాపక్ష నేతగా సుశీల్‌కుమార్‌ షిండే

న్యూఢిల్లీ: యూపీఏ-2 కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు లోక్‌సభా పక్షనేతగా వ్యవహరించిన ప్రణబ్‌ ముఖర్జీ స్థానం ఆయన రాష్ట్రపతి పదవికి ఎన్నికవడంతో ఖాళీ అయ్యింది. ఆ స్థానాన్ని తాజాగా కేంద్ర హోంమంత్రి భర్తీ చేశారు. హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే లోక్‌సభ పక్షనేతగా నియమితులయ్యారు.