లోక్‌ సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం అంశంపై పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం వాయిదా అనంతరం లోక్‌ సభ ప్రారంభంకాగానే విపక్ష సభ్యులు బొగ్గు కుంభకోణానికి నైతిక భాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సభ్యులు తమ పట్టునే వీడకపోవడంతో స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేశారు.