లోయలో పడ్డ బస్సు: 20 మంది దుర్మరణం

హిమచల్‌ప్రదేశ్‌: చంబా సమీపంలో ఓ బస్సు అదుపుతప్పి లోయలోపడింది. ఈ ప్రమాదంలో 20 మంది దుర్మరణం చెందగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. చంబా నుంచి మణిమహేష్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.