వందేళ్ల అవసరాలకు రూట్‌మ్యాప్‌..

` రైజింగ్‌ ` 2047 డ్యాంకుమెంటు డిసెంబర్‌ 9న ఆవిష్కరిస్తాం
` పెట్టుబడుల ఆకర్శణలో ముందున్న తెలంగాణ
` అభివృద్ధికి కేంద్రంగా హైదరాబాద్‌ నగరం
` దేశానికి ఫ్యూచర్‌ సిటీని అందించబోతున్నాం
` ప్రపంచ నగరాలతోనే మా పోటీ ఉంటుంది
` డిసెంబర్‌ 9న విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ
` మలబార్‌ గోల్డ తయారీ యూనిట్‌ ప్రారంభోత్సవంలో సిఎం రేవంత్‌
` తయారీ రంగంలోనే ఎక్కువగా అభివృద్ధి: మంత్రి శ్రీధర్‌బాబు
రంగారెడ్డి(జనంసాక్షి): హైదరాబాద్‌ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం మహేశ్వరంలో మలబార్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెలరీ తయారీ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. మహేశ్వరంలో మలబార్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.డిసెంబర్‌ 9వ తేదీన తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించ బోతున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నామన్నారు. మహేశ్వరంలో ఫోర్త్‌ సిటీ భారత్‌ ఫ్యూచర్‌ సిటీని నిర్మించబోతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారినా మన పారిశ్రామిక పాలసీలు మార్చలేదని గుర్తు చేశారు. పెట్టుబడులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తూ ముందుకు వెళుతున్నామని వివరించారు. పెట్టుబడులను ఆకర్షించడమే కాదు.. వారికి లాభాలు చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకం ఉంచి యూనిట్‌ ఏర్పాటు చేసిన మలబార్‌ గ్రూప్‌నకు ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. అభివృద్ధిలో తెలంగాణ, తమిళనాడు, కేరళ పోటీపడుతున్నాయని చెప్పారు.మహేశ్వరంలో ఇండస్టియ్రల్‌ పార్కు, ’మలబార్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెలరీ’ తయారీ యూనిట్‌ను మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ‘పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ముందుంది. హైదరాబాద్‌కు దేశంలో మరే నగరంతోనూ పోటీ లేదు.. ప్రపంచ నగరాలతోనే పోటీ. రానున్న వందేళ్లను దృష్టిలో పెట్టుకుని విజన్‌-2047 ప్రణాళికను రూపొందించుకున్నాం. నగర అభివృద్ధి కోసం దేశ, విదేశాలకు చెందిన కన్‌స్టలెంట్స్‌ పనిచేస్తున్నాయి. పెట్టుబడిదారులకు రక్షణ కల్పించి వారి వ్యాపారం లాభాల్లో సాగేలా సహకరిస్తున్నాంఅని సీఎం తెలిపారు.అంతకుముందు మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ తెలంగాణలో తయారీ రంగం అభివృద్ధి ఎక్కువగా ఉందని.. 9 శాతానికి పైగా వృద్ధి సాధిస్తోందని చెప్పారు. గ్రీన్‌ ఇండస్టియ్రల్‌, నూతన ఎంఎస్‌ఎంఈ పాలసీ-2025ను ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు 4,200 దరఖాస్తులు వచ్చాయన్నారు. 15 రోజుల్లోనే 98 శాతం దరఖాస్తులను పరిష్కరిస్తున్నామని చెప్పారు. సింగిల్‌ విండో విధానంలో పారదర్శకంగా, వేగంగా అనుమతులు ఇస్తున్నామన్నారు.
తయారీ రంగంలోనే ఎక్కువగా అభివృద్ధి: మంత్రి శ్రీధర్‌బాబు
తెలంగాణలో తయారీ రంగం అభివృద్ధి ఎక్కువగా ఉందని.. 9 శాతానికి పైగా వృద్ధి సాధిస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. గ్రీన్‌ ఇండస్ట్రియల్‌, నూతన ఎంఎస్‌ఎంఈ పాలసీ-2025ను ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు 4,200 దరఖాస్తులు వచ్చాయన్నారు. 15 రోజుల్లోనే 98 శాతం దరఖాస్తులను పరిష్కరిస్తున్నామని చెప్పారు. సింగిల్‌ విండో విధానంలో పారదర్శకంగా, వేగంగా అనుమతులు ఇస్తున్నామన్నారు.

హైదరాబాద్‌కు ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే
` ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికిన సీఎం రేవంత్‌ తదితరులు
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే గురువారం సాయంత్రం హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఆయనకు సీఎం రేవంత్‌ రెడ్డితోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అనంతరం నగరంలోని తాజ్‌ కృష్ణ హోటల్‌కు ఖర్గే చేరుకున్నారు. అయితే మంత్రి పదవి ఆశించి భంగపడ్డ పలువురు ఎమ్మెల్యేలతో ఖర్గే భేటీ కానున్నారు. అందుకోసం వారికి ఖర్గే అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. కాగా, ఆది శ్రీనివాస్‌, బాలు నాయక్‌, మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్‌ సాగర్‌ రావు, సుదర్శన్‌ రెడ్డి, తదితరులు ఇప్పటికే తాజ్‌ కృష్ణా హోటల్‌కు చేరుకున్నారు. అలాగే తెలంగాణ విద్యా కమిషన్‌ ఛైర్మన్‌ ఆకునూరి మురళీ, అగ్రికల్చర్‌ యూనివర్సిటీ వీసీ అల్థాస్‌ జానయ్య సైతం ఖర్గేతో భేటీ కానున్నారు. శుక్రవారం నగరంలోని ఎల్బీ స్టేడియంలో పార్టీ కార్యకర్తలతో భారీ సభ జరగనుంది. ఈ సభకు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆ సందర్భంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు క్యాడర్‌కు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భారీగా కేడర్‌ను ఈ సభకు తరలించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు శుక్రవారం జరగనున్న ఈ సభకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.