వడపర్తి గ్రామపంచాయతీ అభివృద్ధి పథంలో ముందంజ.

 

భువనగిరి మండలం వడపర్తి గ్రామ పంచాయతీ అభివృద్ధికి సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి తనవంతుగా గొప్ప సహకారం అందించినందుకు గాను హెచ్ డి యఫ్ సి బ్యాంక్ బ్రాంచ్ భువనగిరి వారు కృష్ణారెడ్డిని హృదయపూర్వకంగా అభినందించిన బ్రాంచ్ మేనేజర్ భాను శాలువాలతో ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగింది. బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ వడపర్తి గ్రామం దేశంలో గర్వించదగ్గ గ్రామంగా ఎదగాలని దానికి మీలాంటి సర్పంచ్ సహాయ సహకారాలు ఎక్కువగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి బ్యాంకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు