వరంగల్‌లో 200మంది విద్యార్థులకు అస్వస్థత

వరంగల్‌: జిల్లాలోని గీసుకొండ మండలం, ధర్మారం జెడ్పీ హైస్కూల్‌లో 200మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు ఈ రోజు ఐరన్‌ మాత్రలు పంపిణీ చేశారు. ఐరన్‌ మాత్రలు వికటించడంతో విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో విద్యార్థులను ఎంజీఎంకు తరలించారు.