వరదనీటితో పరవళ్లు తొక్కుతున్న పాకాల

ఖానపురం: కాకతీయులు నిర్మించిన చారిత్రక పాకాల జలాశయం వరదనీటితో పరవళ్లు తొక్కుతోంది. జలాశయం పూర్తిగా నిండి గురువారం ఉదయం 11 గంటననుంచి మత్తడిపోస్తోంది. వరంగల్‌ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలాశయం గరిష్ట నీటిమట్టం 30 అడుగులకు చేరింది. ఈ ఏడాది కొత్తగూడ ఆటవీ ప్రాంతంలోను, చెరువు పరిసర అటవీ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో పూర్తిగా నిండింది. జలాశయం వద్ద మత్తడి పరవళ్లు చూసేందుకు వరంగల్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి పర్యటకులు పెద్దసంఖ్యలో వచ్చారు.