వరద ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటన వాయిదా

హైదరాబాద్‌ : నీలం తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సోమవారం పర్యటించాల్సి ఉండగా కార్యక్రమాన్ని రద్దు చేశారు. ముఖ్యమంత్రి రేపు మంగళవారం పర్యటిస్తారని సమాచారం. అత్యవసర సేవల పునరుద్దరణకు నిధులు విడుదలయ్యేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఆపద్బంధు పథకం కింద రూ. 50 వేలు, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. లక్ష పరిహారం అందించాలని అన్నారు. తుపాన్‌పై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సోమవారం సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశానికి పదిమంది మంత్రులు హాజరయ్యారు. బొత్స సత్యనారాయణ, రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మినారాయణ, సుదర్శన్‌రెడ్డి, టీజీ వెంకటేష్‌, డొక్కా మాణిక్యవరప్రసాద్‌, శ్రీధర్‌బాబు, శత్రుచర్ల విజయరామరాజు, ఏరాసు ప్రతాపరెడ్డి హాజరయ్యారు.