వరుసగా నాలుగోరోజు నష్టాలతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: భారతీయస్టాక్‌మార్కెట్‌ వరుసగా నాలుగోరోజు నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 140.90 పాయింట్ల నష్టంతో 17,490.81 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 46.80 పాయింట్లు తగ్గి 5,287.80 వద్ద ముగిసింది. బొగ్గు గనుల కేటాయింపుపై వాగ్‌ నివేదిక వెలువడిన నేపధ్యంలో కొనసాగుతున్న రాజకీయ పరిణామాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లతో కొనసాగుతున్న బలహీన ధోరణి కూడా మార్కెట్‌పై ప్రభావాన్ని చూపించిందని మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు.