వర్ల రామయ్యకు పామర్రు బాధ్యతలు

పామర్రు : కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ తెదేపా ఇన్‌చార్జీ బాధ్యతల్ని రాష్ట్ర తెదేపా ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య శుక్రవారం చేపట్టారు. మండలంలోని నిమ్మకూరు గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పొలిట్‌ బ్యూరో సభ్యుడు కె.ఎర్రనాయడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెదేపా అత్యధిక మెజార్జీ సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే, తెదేపా జిల్లా అధ్యక్షులు దేవినేని ఉమా, నందిగామా ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్‌, గన్నవరం ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావు, ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌, మాజీ ఎంపీపీ గొట్టిపాటి లక్ష్మీ దాస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.