వర్షాల కోసం..72గంటలు ఆగాల్సిందే!

హైదరాబాద్‌, జూన్‌ 8 : మరో 72 గంటల తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రెండు రోజుల్లో ఎండ తీవ్రత ఉన్నప్పటికీ పొడిగాలులు వీస్తాయని చెప్పారు. చత్తీస్‌గడ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర తీరం వెంబడి అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, అది బలహీనంగా ఉందని, దాంతో ఒకటి రెండు చోట్ల తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.  ఏదేమైనా రాష్ట్రంలో వర్షాల కోసం ఈ నెల 12వ తేదీ వరకు వేచి ఉండాల్సిందేనని అంటున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారంనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తీవ్రంగానే ఉన్నాయి. రెంటచింతల, ఆదిలాబాద్‌లలో 43 డిగ్రీలు ఉండగా హైదరాబాద్‌లో 38 డిగ్రీలు నమోదు అయింది. హైదరాబాద్‌ నగరంలో మధ్యాహ్నం 3 గంటల తర్వాత వాతావరణం కొద్దిగా చల్లబడింది.