వసంత్‌నగర్‌లో బీహార్‌ ఉన్నతాదికారుల పర్యటన

కుకట్‌పల్లీ:బీహార్‌లోని భూగర్బ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో పక్క రాష్ట్రలు అవలంబిస్తున్న పద్దతులను స్వయంగా పర్యవేక్షించి జల వనరులను కాపాడేందుకు అక్కడి హైకోర్టు ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేసింది.ఆంద్రప్రదేశ్‌ అవలంబిస్తున్న జల సంరక్షణ విధానాలను తమ ప్రభుత్వం కూడ పాటించాలని బీహార్‌ ప్రభుత్వం నియమించిన పాట్న జీహెచ్‌ఎంసీ ఓఏఎస్‌,ఇద్దరు సీటీ ప్లానర్ల బృందం కూకట్‌పల్లీ సర్కిల్‌ వసంత్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంకుడుగుంతల విధానాన్ని  పరిశీలించింది.దీనిలో భాగంగా జలవనరులను కాపాడేందుకు తీసుకోవలసిన విధానాలను ఇక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఆంద్రప్రదేశ్‌ పాటిస్తున్న జల సంరక్షణ విధానాలను తమ ప్రభుత్వానికి నివేదిస్తామని బీహార్‌ అదికారులు తెలిపారు.దీనిలో బాగంగా ఇతర ప్రక్క రాష్ట్రలైన తమిళనాడు,కర్నాటక,మహారాష్ట్రాలను కూడ సందర్శించనున్నామని బృందం సభ్యులు తెలిపారు.