వాటర్‌ట్యాంక్‌ఎక్కి ఆటోడ్రైవర్‌ ఆత్మహత్యయత్నం

ఖమ్మం(దమ్మపేట): తన ఆటోకు అన్ని పత్రాలున్న సత్తుపల్లి మోటరు వెహికికిల్‌ అధికారులు ఆటోను సీజ్‌ చేశారంటూ వాటర్‌ట్యాంక్‌ఎక్కి ఆటోడ్రైవర్‌ ఆత్మహత్యయత్నానికి పాల్పడినాడు. మండలంలోని మందలపల్లి గ్రామానికి చెందిన సైదులు ఆటో నడిపి జీవిస్తున్నాడు. సోమవారం సాయంత్రం అసిస్టెంట్‌ మోటరు వెహికిల్‌ అధికారి ఆపి పత్రాలు సక్రమంగా లేవంటూ వాటర్‌ట్యాంక్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటునని అనటంతో దమ్మపేట ఎస్‌ఐ సుబ్బయ్య వచ్చి కారణం అడగగా పై విషయం చెప్పాడు. ఆయన ఆర్టీఏ అధికారులతో సంప్రదించి ఆటోను వదిలేస్తారని చెప్పటంతో యవకుడు కిందికి దిగాడు.