వాటర్ ట్యాంకర్ ఢీకొని బాలుడు మృతి

హైదరాబాద్ జ‌నంసాక్షి : ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల బాలుడిని వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మదాపూర్ పీఎస్ పరిధిలోని పర్వత్‌నగర్‌లో చోటు చేసుకుంది. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాలుడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.