వాన్‌పిక్‌ ఒప్పందం రద్దు చేయాలని సీఎంకు బాబు లేఖ

హైదరాబాద్‌: వాన్‌పిక్‌ ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాసిన లేఖను తెదేపా నేతల బృందం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అందజేసింది. రాష్ట్రమంత్రితోపాటు ప్రధాన ప్రతిపక్షంతో పాటు ఇతర రాజకీయపక్షాలు వాన్‌పిక్‌ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్‌చేస్తుంటే సర్కారు ఎందుకు వూగిసలాడుతోందని తెలుగేదేశం సీనియర్‌నేత ఎర్రనాయుడు ప్రశ్నించారు. ఒప్పందం రద్దు న్యాయపరంగా గల చిక్కుల్ని పరిశీలిస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పినట్టు నాయుడు విలేకరులకు తెలిపారు. ఒప్పందం రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రగవర్నర్‌కు కూడా వినతిపత్రం సమర్పిస్తామని ఆయన వెల్లడించారు.