వాన్‌పిక్‌ భూముల్లో సాగు చేసే వరకు పోరు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ
ఒంగోలు: ప్రకాశం జిల్లాలోని వాన్‌పిక్‌ భూములు హద్దు రాళ్లను సీపీఐ రాష్ట్రకార్యదర్శి నారామణ తొలగించారు. వాన్‌పిక్‌ భూముల పై పోరాటాన్ని ఆరంభించేందుకు మంగళవారం ఉదయం ఒంగొలుకు చేరేకున్న ఆయన సీపీఐ నేతలు, కార్యకర్తలతో గుండాయపాలెం చేరుకున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పోరాటం కొనసాగుతుందని, తమ పొలాల్లో రైతులు వ్యవసాయం చేసుకునేంత వరకు తమ పోరు అగదని ఆయన స్పష్టం చేశారు. గతంలో తాము వాక్‌పిక్‌ పోరు చేసిన సందర్భంగా రాజకీయ నాయకులు రైతుల్ని విభజించారని, అదే రైతులు నేడు తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడుతున్నారన్నారు.