వాయిదాలు లేని ఉత్తరప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు

లక్నో:కాగితాలుచించుకోవడం,మైకులు విరగకోట్టడం సాదారణంగా అసెంబ్లి సమావేశాలు అంటే మనకు గుర్తుకొచ్చేవి ఇవే.కాని ఇవి ఏమీ లేకుండా ఒక్కసారి కూడా వాయిదా పడకుండానే ఉత్తరప్రదేశ్‌ శాసన సభ సమావేశాలు విజయవంతంగా ముగిసాయి. 21 రోజుల పాటు సాగిన సమావేశాల్లో 138 గంటల పాటు ప్రజా సమస్యలపై వివిధ చర్చలు జరిగాయి. ప్రతి పక్ష బిఎస్‌పి అధినేత్రి మాయవతి అసెంబ్లీ సమావేశాలకు ఎలాంటి ఆటంకాలు కల్పించవద్దంటూ తమ ఎమ్మెల్యేలకు సూచించడం విశేషం. కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలతో సహా ప్రతి ఒక్కరు ప్రజాసమస్యలపై ఉత్సహంగా చర్చల్లో పాల్గొని మిగితా రాష్ట్ర శాసన సభలకు ఆదర్శంగా నిలిచారు.