వారం రోజుల్లో విద్యుత్‌ సమస్య తిరుతుంది: ముఖ్యమంత్రి

కర్నూలు: వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్‌ను  సరఫరా చేయాలిని అధికారులు ఆదేవించినట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిజేశారు. కర్నూలు జిల్లా గొప్పాడు మండలం దీపగుంటలో ఇందిరమ్మబాట కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. మరో వారం రోజుల్లో రుణాలు తీసుకునే 95 లక్షల మంది రైతులకు వడ్డీ పూర్తిగా చెల్లిస్తున్నామని తెలిపారు.  సన్నరకాలను రాష్ట్ర ప్రభుత్వమే క్వింటాల్‌కు రూ.1500 చెల్లించి కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. వ్యవసాయ పరికరాల కొనుగోలుపై రైతులకు 50 శాతం సబ్సిడీ అందిస్తున్నామని చెప్పారు.