వారసత్వ రద్దు పత్రాలను దహనం చేసిన టీబీజీకేఎస్‌

జాతీయసంఘాల వ్యవహారంపై నిరసనలు
కాకతీయఖని, జూన్‌
ఎన్నో ఏళ్లుగా సింగరేణిలో నడుస్తున్న వారసత్వ ఉ ద్యోగాల రద్దుకు సహకరించిన జాతీయ సంఘాల వ్యవహారాన్ని నిరసిస్తూ, ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్‌ పత్రాలను బుధవారం ఏరియాలోని అన్ని గనులపై దహనం చేశారు. 1981 జనవరి 21న ఈ హక్కును జాయింట్‌ యాక్షన్‌ కమిటీిగా ఏర్పడి కార్మికుల పిల్ల్లలకు ఉపాధి హక్కుగా సాధించుకోవడం జరిగిందని ఈ సందర్బంగా బ్రాంచి ఉపాధ్యక్షుడు అప్పాని శీనివాస్‌ తెలిపారు. వారసత్వ ఉద్యోగ హక్కును టీడీపీ ప్రభుత్వ హ యాంలో నారా చంద్రబాబునాయుడు, ఆర్‌ఎల్‌సి రమణకుమార్‌, డైరెక్టర్‌ (పా) సమర్య సమక్షంలో ఏడు జాతీయ సంఘాలు కలిసి జూన్‌ 6 1998 న యాజమాన్యం వద్ద సమాది చేసినట్లు ఆరోపిం చారు. ఈ రోజు కార్మికుల పిల్లలకు చీకటి రోజని అందుకనే అగ్రిమెంట్‌ పత్రాలను దహనం చేసిన ట్లు చెప్పారు. జాతీయ సంఘాలు కార్మిక వ్యతిరేక చర్యలకు మూలంగా కార్మికుల పిల్లలు నిరుద్యోగులు గా మారినట్లు వెల్లడించారు. రానున్న గుర్తింపు ఎన్నికల్లో జాతీయ సంఘాలకు తగిన గుణపాఠం చెప్పి, తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమిస్తున్న టీబీజీకేఎస్‌ను ఆదరించాలని కార్మికులను కోరా రు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు…. కేటీకే 1వ గనిలో కొమ్మెర లక్ష్మణ్‌, కె. మహేందర్‌, లక్ష్మ ణకుమార్‌, సుదర్శన్‌, నయీం, నాగేశ్వరరావు, రా జమెగిళి, మల్లారెడ్డి తదితరులు కేటీకే 2వ గనిలో అప్పాని శ్రీనివాస్‌, బందెల చందర్‌రావు, నర్సింగ రావు, మల్లేష్‌, షరీఫొద్దీన్‌, వెంకటేశ్వర్లు, చంద్ర మౌళి తదితరులు, కేటీకే 5వ గనిలో మండ సంప త్‌, సంపత్‌రావు, సాయిలు, కుమారస్వామి, ఓదే లు, శ్రీనివాసరెడ్డి, రమేష్‌, ఆంజనేయులు, రాజం, తదితరులు పాల్గొన్నారు. కేటీకే 6వ గనిలో మనో జ్‌కుమార్‌, స్వామి, కనకయ్య, మొగిళి, రాజయ్య, శంకర్‌, లక్ష్మీరాజం తదితరులు, కేటీకే 8వ గనిలో చంద్రయ్య, యూసుఫ్‌, శంకర్‌, రాజయ్య, నారాయణ, శంకర్‌ తదితరులు కేటీకే ఓసీలో  శంకర్‌, దామోదర్‌రావు, వర్క్‌షాప్‌లో శ్రీనివాస రెడ్డి, మల్హర్‌రావు తదితరులు పాల్గొన్నారు.