వాహనాలను శుభ్రపరుస్తూ బిల్లింగ్‌ కార్మికుల నిరసన

కరీంనగర్‌, మే 26 : విద్యుత్‌ స్పాట్‌ బిల్లింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు సమ్మెలో భాగంగా శనివారం ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయం ఎదుట వాహనాలను శుభ్రం చేస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు జి.సంతోష్‌, అశోక్‌, కిరణ్‌, కొండయ్య, పృథ్వీ, ప్రసాద్‌, రాజిరెడ్డి, ముత్యం, శంకర్‌, రవి, చందర్‌, శ్రీనివాస్‌, తిరుపతితోపాటు మరో 50 మంది కార్మికులు పాల్గొన్నారు. కాగా, స్పాట్‌ బిల్లింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు చేపట్టిన సమ్మె శనివారానికి 11వ రోజుకు చేరింది.