వికలాంగుల పట్ల మానవత దృక్పధం చూపాలి: బాబు

హైదరాబాద్‌: వికలాంగుల పట్ల ప్రభుత్వం మానవత దృక్పథం చూపాలని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం తన నివాసంలోని వికలాంగులైతే తల్లిదండ్రులకు మరింత కష్టమని ఆవేదన వ్యక్తం చేశారు.వికలాంగులకు సమస్యను అధిగమించే మనోదైర్యం ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. మాదిగలు, మాదిగ ఉపకులాంగులకు ప్రత్యేకంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. వికలాంగులకు రూ. వెయ్యి పింఛను ప్రభుత్వం ఇవ్వాలని ఈ సందర్భంగా చంద్రబాబు డిమాండ్‌ వ్యక్తం చేశారు. తెదేపా అధికారంలోకి వస్తే వికలాంగులకు రూ. 1500 ఫించను, ఒక ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు.