వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్మా హాజరుకానున్న తెలంగాణ పి సిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి

 మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ డిసిసి అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి
వికారాబాద్ రూరల్ డిసెంబర్ 2 జనం సాక్షి
రైతు సమస్యల పరిష్కారం కోసం ఈనెల 5 న వికారాబాద్ కలెక్టరేట్ కార్యాలయం నిర్వహించే మహా ధర్నా కార్యక్రమానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ డిసిసి అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు గురువారం మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ధరణి ఫోల్డర్ రైతులకు తీరని అన్యాయం చేస్తుందని దానిని వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని అదేవిధంగా దీర్ఘకాలిక స్వల్ప కాలిక వ్యవసాయ రుణాలు ఒకేసారి రుణమాఫీ చేయాలని డిమాండ్ తో తలపెట్టిన మహా ధర్నా కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు వారు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్ని ఉద్యమాలు చేసినా కనికరించకపోవడంతో స్వయంగా రేవంత్ రెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ముందు నిర్వహించే మహా ధర్నాకు హాజరవుతున్నారని వారు తెలిపారు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వ్యవసాయ రైతులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు సకాలంలో హాజరై మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి మాజీ పిఎసిఎస్ చైర్మన్ కిషన్ నాయక్ రత్నారెడ్డి మాజీ ఎంపీపీ నర్సింలు ముదిరాజ్ జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్ ఆయా గ్రామాల సర్పంచులు ఎంపిటిసి సభ్యులు హాజరయ్యా రు