విగ్రహం ధ్వంసం కేసులో ఏడుగురు అరెస్టు

విజయవాడ, ఆగస్టు 1 : రాజ్యాంగ నిర్మాత బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం ధ్వంసం కేసులో ఏడుగురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆదివారం అర్థరాత్రి చందర్లపాడు బస్టాండ్‌ సెంటర్‌లో ఉన్న అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడం, దానిపై దళిత సంఘాలు ఆందోళన చేపట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు మంగళవారం ఏడుగురిని అరెస్టు చేశారు. వారంతా తాగిన మైకంలో ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడించారు. అయినా దీని వెనక ఇతర కారణాలు ఏమైన ఉన్నాయా అన్న కోణం నుండి కూడా దర్యాప్తు చేస్తున్నారు.