విగ్రహాల వివరాలు వెల్లడించిన టీటీడీ

తిరుపతి: తిరుమలేశునికి అజ్ఞాత భక్తుడు సమర్పించిన వజ్రాల పొదిగిన శ్రీవారు. శ్రీదేవి, భూదేవి విగ్రహాల వివరాలను తితిదే అధికారులు వెల్లడించారు. ఈ విగ్రహాల విలువ రూ.125కోట్లు వుంటుందని సుబ్రమణ్యం తెలిపారు. 14అంగుళాల పొడవున్న విగ్రహాల బరువు రెండున్నర కిలోలని, ఈ విగ్రహాలకు 1014వజ్రాలు, 552కెంపులు, 190పచ్చలు, నీలంరాయి ఉన్నాయని వెల్లడించారు.