విజయవంతంగా కొనసాగుతున్న కంటి వెలుగు 2

విజయవంతంగా కొనసాగుతున్న కంటి వెలుగు 2
బిచ్కుంద మార్చి 23 (జనంసాక్షి)
కంటి సమస్యలతో బాధపడుతున్నవారు కంటి వెలుగుతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా కంటి సమస్యలు దూరమవుతున్నాయని జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన వారికి కండ్లద్దాలు అందజేస్తుండడంతో కండ్ల జోళ్లు ధరించిన వారు మురిసిపోతున్నారు. కంటి చూపు సరిగా కనిపించక ఇబ్బందులు పడుతున్న మాకు కంటి వెలుగు కార్యక్రమంతో తమ జీవితాల్లో వెలుగు నింపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిండు నూరేండ్లు చల్లగా ఉండాలని దీవెనార్తులిస్తున్నారు. మండలంలోని సీతారాంపల్లి గ్రామ పంచాయతీ వద్ద రెండవ రోజు కార్యక్రమం మద్యాహ్నం వరకు 280 మంది కంటి పరీక్షలు నిర్వహించగా, 60 మందికి కళ్లద్దాలు అందజేశామని, మరో 40 మందికి అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ శశికుమార్, పంచాయతీ సెక్రటరీ షోయబ్, సూపర్ వైజర్ విఠబాయి, శోభ, సులోచన అర్షియా మరియు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.