విజయవాడలో యువకుడి ఆత్మహత్య

విజయవాడ: విజయవాడ వాంబే కాలనీలోని బచ్చల నరేష్‌ (25) అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా కల్లూరికు చెందిన  దుర్గాభవానితో ఇతనికి ఆరు నెలల క్రితం వివాహమైంది. రెండు వారాల క్రితం శ్రావణ శుక్రవారం ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.