విజయవాడలో సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన రైలింజన్‌

విజయవాడ: విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఈ రోజు రాత్రి స్వల్పప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్‌లోని నాలుగో ఫ్లాట్‌ఫాంలో ఆగివున్న సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ను సిగ్నలింగ్‌ లోపం కారణంగా ఓ రైలు ఇంజిన్‌ వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. దీంతో రైల్వే అధికారులపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.