-విత్తనపు పొట్టేళ్ల ఎంపికలో  మెళకువలు పాటించాలి…-విత్తనపు పొట్టేళ్ల ఎంపికలో  మెళకువలు పాటించాలి… -జిల్లా పశువైద్య&పశుసంవర్ధక శాఖ అధికారి డా.జివి.రమేష్… 

నాగర్ కర్నూల్ ఆర్సీ ఫిబ్రవరి27(జనంసాక్షి):విత్తనపు పొట్టేలు మందలో సగభాగం,సరైన పొట్టేలును ఎంపిక చేసుకున్నట్లైతే మంచి జాతి లక్షణాలు ఉన్న పిల్లలు పుట్టి మంద అభివృద్ధి చెందుతుంది అని జిల్లా పశువైద్య మరియు పశు సంవర్ధక శాఖ అధికారి డా.జివి.రమేష్ అన్నారు.జిల్లా వ్యాప్తంగా ఈ నెల 22 వ తేదీ నుండి కొనసాగుతున్న సామూహిక గొర్రెల మరియు మేకల నట్టల నివారణ కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు తెలకపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన శిభిరాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా గొర్రెల కాపరులను ఉద్దేశించి మాట్లాడుతూ 2 సంవత్సరాల వయసున్న మంచి జాతి లక్షణాలున్న ,మంచి యాజమాన్య పద్దతులు ఉన్న మంద నుండి పొట్టేలును ఎంపిక చేసుకోవాలి.దృఢమైన అంగము,సమపాళ్ళలో వృషణాలు కలిగి,చురుకుగా,ఆరోగ్యంగా ఉన్న పొట్టేలును ఎంపిక చేసుకోవాలి,వృషణాలకు వాపు కానీ,కణుతులు కానీ లేకుండా చూసుకోవాలి.విత్తన పొట్టేలును ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మార్చాలి,ప్రతి 25-30ఆడ గొర్రెలకు ఒక విత్తనపు  పొట్టేలు అవసరం.పొట్టెలుకు ప్రతి రోజూ 150-200 గ్రాముల మిశ్రమ దాన అందించినట్లైతే లైంగిక సామర్థ్యం పెరిగి,నాణ్యమైన వీర్యం తయారవుతుంది.గొర్రెలకాపరుల సంక్షేమం కొరకు జీవాలకు  సంవత్సరానికి మూడు పర్యాయాలు నట్టల నివారణ మందులను మరియు వివిధ రకాల వ్యాధి నిరోదక టీకాలను పంపిణీ చేస్తుందని తెలిపారు.నట్టల నివారణ మందులను తాగించడం వల్ల జీవాలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండ రోగాల బారిన పడే అవకాశాలు తగ్గు ముఖం పడతాయన్నారు.జీవాల బరువు పెరుగుదలకు మరియు మేలైన పునరుత్పతికి ఈ మందులు ఎంతగానో ఉపయోగపడతాయి కావున గొర్రెల కాపరులు విధిగా నట్టల నివారణ మందులను తాగించుకోవాలని  సూచించారు.మరియు గొర్రెల పునరుత్పతి పెరుగుటకు తీసుకోవాల్సిన యాజమాన్య పద్దతులను  వివరించారు.ఈ కార్యక్రమంలో తెలకపల్లి MPTC విజయలక్ష్మి,పశువైద్యాధికారి డా.నాగరాజు యాదవ్  సిబ్బంది నూర్జహాన్,అరిఫ్ పాల్గొన్నారు.