విద్యార్థి బలవన్మరణం

హైదరాబాద్‌,అక్టోబర్‌29 ( జనం సాక్షి ) : నగర శివార్లలోని పేట్‌బషీరాబాద్‌లో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిరది. పేట్‌బషీరాబాద్‌లోని జయరామ్‌నగర్‌కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె బలవన్మరణానికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.