విద్యార్థులకు ఇక యూనిక్‌ ఐడి 

పక్కాగా నిధుల ఖర్చుకు చర్యలు
హైదరాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): పారదర్శక విధానాల ద్వారా పాఠశాల విద్యను పటిష్టం చేయబోతున్నారు. పారదర్శక విధానాలకు తోడుగా ప్రభుత్వం ఖర్చు పెడుతున్న డబ్బు ప్రతిపైసా పక్కాగా ఖర్చు కావాలన్నదే లక్ష్యంగా ఉంది. అందుకే ఈ మధ్య కెజి టూ పిజి వరకు అన్ని సంస్థల ప్రక్షాళన
జరగుతోంది. ఎక్కడా అవకతవకలు తావులేని విధంగా విద్యారంగం ప్రక్షాళనకు రంగం సిద్దం చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖలో వేగంగా సంస్కరణలు అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ-గవర్నెన్స్‌ విధానం అమలు చేయడానికి ఆ శాఖ ఉన్నతాధి కారులు చర్చలు చేపట్టారు. విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌ పరిధిలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకొసం విద్యార్థులందరికీ ప్రత్యేకంగా యూనిక్‌ అడెంటిటీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) శాశ్వత నంబర్‌ ఇవ్వనున్నారు. ఈ నంబర్‌ ద్వారా భవిష్యత్‌లో విద్యార్థి అకడమిక్‌ వివరాలో పాటు వారు పొందుతున్న ప్రయోజనాలు నమోదవుతాయి. ఈ విధంగా విద్యార్థికి సంబంధించిన సమగ్ర సమాచారం మొత్తాన్నిఆన్‌లైన్‌ పరిధిలోకి తీసుకువస్తున్నారు.విద్యార్థులందరికీ యూఐడీఏఐ నంబర్‌ జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నతారు. ఆ
మేరకు విద్యార్థుల నుంచి ఆధార్‌ నంబర్‌  స్వీకరిస్తున్నారు. ఈ నంబర్‌ ఆధారంగా ఇక నుంచి అన్ని రకాల ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అము పరచాలని భావిస్తున్నారు. దీని ఆధారంగానే విద్యార్థుల కోసం కావాల్సిన బడ్జెట్‌ కేటాయిస్తారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో 94 శాతం ఆధార్‌ నంబర్‌ ప్రక్రియ పూర్తయింది. ప్రైవేటు పాఠశాలల్లో 78 శాతం విద్యార్థులు ఆధార్‌నంబర్‌ దాఖలు చేశారు. మిగిలిన వారి కోసం నమోదు కేద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యాశాఖ రికార్డుల ప్రకారం మొత్తం 60 లక్షల మంది విద్యార్థులు ఎన్‌రోల్‌ చేసుకున్నారు. కాని తాజా లెక్కల ప్రకారం 57 లక్షల మంది ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. మూడు లక్షల మంది విద్యార్థుల లెక్కలు తేలడం లేదు. ఈ మూడు లక్షల మంది విద్యార్థుల వివరాలు బోగస్‌గానే ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థుల పేరుతో ఉచిత యూనిఫారాలు, పాఠ్యాపుస్తకాలు, మధ్యామ్న భోజనం వంటి పతకాలు దుర్వినియోగం కాకుండా నియంత్రంచడం కోసం ఈ-గర్నెన్స్‌ విధానాన్ని అమలు పరుస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్‌ ప్రయెజనాల కోసం జీవిత కాలం మొత్తం యూఐడీఏఐ నంబర్‌ శాశ్వతంగా ఉంటుందని అధికారులు స్పష్టంచేస్తున్నారు.ఈ విధానం ఇప్పటికూ కేంద్రీయ విద్యాలయాలలో అమలు పరుస్తున్నారు. దాని వల్ల మంచిఫలితాలు నమోదు అవుతున్నాయన్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏటా ఆరు లక్షల మంది విద్యార్ధులు ఒకటో తరగతిలో నమోదవుతున్నారు. వారందరికీ ఆధార్‌ నమోదు చేయడానికి విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో శాశ్వత ఆధార్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.ఇవన్నీ చేపడితే పాఠశాల విద్య మరింత బలోపేతం కానుంది. పథకాలు పక్కాగా అముల కానున్నాయి.