విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం లేదు: సురేఖ

వరంగల్: జిల్లాలోని గీసుకొండ మండలం ధర్మారం ప్రభుత్వ పాఠశాలలో ఐరన్ మాత్రలు వికటించి ఎంజీఎంలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని ఎమ్మెల్యే కొండా సురేఖ తెలిపారు. ఎంజీఎంలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆర్డీవో మాధవరావు పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం లేదు. మెరుగైన చికిత్సను అందిస్తున్నమని పేర్కొన్నారు.

ఆందోళన అవసరం లేదు: వైద్యులు

విద్యార్థుల ఆరోగ్యస్థితిపై ఆందోళన అవసరం లేదని ఎంజీఎం డాక్టర్లు తెలిపారు. విద్యార్థులు తినకుండా మాత్రలు వేసుకోవడంతోనే అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం 120 మందికి చికిత్స అందిస్తున్నాం. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడకగానే ఉందని వైద్యులు వెల్లడించారు.