విద్యార్థులు ఎంత జ్ఞాన సముపార్జన చేసుకుంటే అంత ఆస్తి సంపాదించినట్లే.
విద్య తరగని ఆస్తి,దొంగిలించేది కాదు.
శాసనసభ పోచారం శ్రీనివాస్ రెడ్డి
కోటగిరి మార్చి 10 జనం సాక్షి:-ఉన్నత చదువులు చదివి అపారమైన జ్ఞానసముపార్జన గావించి ఉపాధ్యాయవృత్తికి ఎన్నికైన వృతులు ప్రభుత్వ ఉపాధ్యాయులని తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం కోటగిరి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల 47 వ వార్షికోత్సవ వేడుకలలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నా రు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపక బృందం ఆధ్వర్యంలో చిన్నారులు వివిధ వేషధారణలో పెద్ద ఎత్తున శాసన సభాపతికి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు వివిధ కళా సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం పాఠశాల వార్షికోత్సవ ప్రత్యేక ఆహ్వానితులు పోచారం సురేందర్ రెడ్డి పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన 700 టీషర్టులను స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి పాఠశాల యాజమాన్యనికి అందజేశారు.అదేవిధంగా వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన పాఠశాల విద్యార్థులకు స్పీకర్ మెమెంటోలను అందజేశారు.ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ..కోటగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 47 వ వార్షికోత్సవ వేడుకలు చక్కటి చల్లటి వాతావరణంలో ఆహ్లాదకరంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.ఉపాధ్యాయులు కష్ట పడితేనే ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు.ప్రభుత్వ పాఠశాలలో బోధించే విద్య స్టాండర్డ్ విద్య అని పేర్కొన్నారు.ఈ పాఠశాలలో వివిధ రకాల కమిటీలు ఏర్పాటు చేసుకుని ఆ కమిటీలను ఉపాధ్యాయుల పర్యవేక్షణలో క్రమశిక్షణతో నిర్వహించుకోడం గర్వకారణం అన్నారు.విద్యార్థులను క్రమశిక్షణతో ఉంచడమే కాకుండా ఉపాధ్యాయులు నిజ జీవితం లో వాటిని పాటించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చదివే చదువు ఎవరు దొంగలించేది కాదు.విద్యార్థులు చదివిన చదువు వారి ఆస్తి అని అన్నారు.కావున చిన్నారులు చక్కగా చదువుకొని పాఠశాల,తల్లిదండ్రుల,గ్రామ పేరును నిలబెట్టాలని విద్యార్థులకు సూచించారు. బాన్సువాడ నియోజక వర్గంలో ప్రభుత్వ పాఠశాలలో శాశ్వత నిర్మాణాల కోసం సుమారు 60కొట్ల పనులు జరిగాయన్నారు. పాఠశాల అవసరాల కోసం ప్రధానోపాధ్యాయులు కోరిన విధంగా పాఠశాల మరుగుదొడ్ల నిర్మాణం కోసం రూ.10 లక్షలు,పాఠశాల ఆవరణంలో షెడ్డు నిర్మాణం కోసం రూ.20 లక్షలు,పాఠశాలలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం రూ. మూడు లక్షల నిధులను మంజూరు చేస్తున్నట్లు స్పీకర్ పేర్కొన్నారు. అదేవిధం గా పాఠశాలలో నెలకొన్న ఖాళీల సిబ్బంది విషయం లో ఉన్నత అధికారులతో సంప్రదించి తగిన చర్యలు చేపడతామన్నారు.ఈ సందర్భంగా ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణ, సమన్వయం,క్రమశిక్షణతో బాగా చదువుకొని పాఠశాలకు మంచి పేరు తేవాలన్నారు.ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా కోటగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గొప్పగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయ బృందానికి వారు అభినందనలు తెలియజేశారు. అలాగే ఆర్డీవో రాజేశ్వర్ మాట్లాడుతూ.బాన్సువాడ నియోజకవర్గంలో విద్యావ్యవస్థకు స్పీకర్ చేస్తున్న కృ షి వెలకట్టలేనిదని అన్నారు.ఈ పాఠశాల విద్యార్థు లను సంస్కారం,సంస్కృతి,మానవ సంబంధాలు, సత్ప్రవర్తన గా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యా యులపై ఎంతైనా ఉందన్నారు.ఈ వార్షికోత్సవ వేడుకలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాల్లప్ప, ఎంపీపీ వల్లేపల్లి సునీత శ్రీనివాస్,జెడ్పిటిసి శంకర్ పటేల్,ఆర్డీవో రాజేశ్వర్,ఏసిపి కిరణ్ కుమార్,స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్,జిల్లా కో ఆప్షన్ సభ్యులు సిరాజుద్దీన్,స్థానిక సింగల్ విండో చైర్మన్ కూచి సిద్దు,బీర్కూర్ గంగాధర్,మార్కెట్ కమిటీ చైర్మన్ హమీద్,పోల విఠల్ సేట్,మండల కో ఆప్షన్ సభ్యులు ఇస్మాయిల్,ఎమ్మార్వో,ఎంపీడీవో,మండల ప్రజా ప్రతి నిధులు,అధికారులు,అధ్యాపక బృందం, సిబ్బంది, పాఠశాల పూర్వ విద్యార్థులు,విద్యార్థిని,విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.