విద్యార్థులు ఎదుగుదలకు పోషకాల అవసరం

శంకరపట్నం: జనం సాక్షి సెప్టెంబర్ 22
ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినిలకు విద్యార్థులకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పౌష్టికాహారాన్ని, పోషక ఆహారాన్ని అందించాలని, శంకరపట్నం తహశీల్దార్ గూడూరి శ్రీనివాసరావు మధ్యాహ్న భోజన నిర్వాహకులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. గురువారం మండలంలోని కేశవపట్నం జిల్లా పరిషత్ పాఠశాల లో మధ్యాహ్నం భోజనం నిర్వాహకులతో ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మమతా గౌతమి, మిడ్ డే మిల్స్ నిర్వాహకులు తాశీల్దార్ శ్రీనివాసరావు ఎదుట సమస్యలను వివరించారు. ఉపాధ్యాయులు మమత గౌతమి, మధ్యాహ్న భోజన నిర్వాహకులు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మెనూ పాటించి, విద్యార్థిని ,విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించి విద్యార్థులు ఎదుగుదలకు తమ వంతు కృషి చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తే శాఖ పరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో గ్రామ సర్పంచ్ బండారి స్వప్న తిరుపతి, ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గజ్జెల్లి హనుమంతు, సిపిఐ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.