విద్యార్థులు క్రమశిక్షణ తో చదవాలి.
విద్యార్థులు క్రమశిక్షణ తో చదవాలి.మల్కాజిగిరి.జనంసాక్షి.మార్చి24
విద్యార్థులు పట్టుదలతో చదివితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. మౌలాలి లోని సెయింట్ జార్జి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో కార్పొరేటర్లు సునీత యాదవ్,జెర్రిపోతుల ప్రభుదాస్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ. తల్లిదండ్రులు పిల్లల నడవడికను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని,విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని వారి సలహాలు సూచనలు పాటిస్తూ చదివితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని సూచించారు.అనంతరం విద్యార్థినీ విద్యార్థులు,జబర్దస్త్ కామెడీ షో బుల్లెట్ భాస్కర్,నరేష్,తమదైన శైలిలో ఆటపాటలతో ఆహుతులను ఆకట్టుకున్నారు.ఆట పాటలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు.ఈకార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ స్వరూప్ రెడ్డి,ఎన్ ఏ నాయుడు, సునంద, దీప్తి ఠాకూర్,సతీష్, విద్యార్థిని,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.