విద్యార్థులు చదువులో రాణించాలి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
జడ్పీటీసీ కోడిత్యాల నరేందర్ గుప్తా
ఆత్మకూర్ (ఎం) సెప్టెంబర్ 2 (జనంసాక్షి) ఆత్మకూరు మండల కేంద్రంలో వసతి గృహ విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని చదువులో రాణించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పి యాదయ్య గారు అన్నారు. ఈరోజు ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహం ఆత్మకూరు ఎం లో వసతి గృహ సంక్షేమ అధికారి వేముల స్వప్న అధ్యక్షతన జరిగిన నోట్ బుక్స్ ప్లేట్లు గ్లాసులు బెడ్ షీట్లు కార్పెట్ ల.పంపిణీ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు గౌరవ అతిథిగా పాల్గొన్న ఆత్మకూరు జడ్పిటిసి కోడిత్యాల నరేందర్ గుప్తా గారు మాట్లాడుతూ విద్యార్థినిలకు సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని విద్యారంగంపై ఎన్ని నిధులు కేటాయించిన తక్కువేనని విద్యార్థినిలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని వారి సమస్యలపై అందరికన్నా ముందుండి పోరాడుతానని హాస్టల్ యొక్క ప్రహరీ గోడ నిర్మాణం ఇతర సమస్యల పరిష్కారం కోసం తనవంతుగా ప్రభుత్వంతో పోరాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు ఆత్మకూరు ఎంపీటీసీ యాస కవిత ఇంద్రారెడ్డి గారు మరియు సర్పంచ్ జన్నాయికోడె నగేష్ గారు మాట్లాడుతూ విద్యార్థులు హాస్టల్లో క్రమశిక్షణతో ఉంటూ చదువు ఒక్కటే ద్యేయంగా కష్టపడి చదువుకొని మంచి ఉత్తీర్ణత సాధించి ఆత్మకూరు ఎం కు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు అనంతరం విద్యార్థినీలకు నోట్ బుక్స్ ప్లేట్లు గ్లాసులు బెడ్షీట్లు కార్పెట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరికీ విద్యార్థినిలు సన్మానం చేసి జ్ఞాపికను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వసతి గృహ సిబ్బంది తోడేటి లలిత బుంగ పట్ల సత్తమ్మ విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు