విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ సచావాలయ ముట్టడికి యత్నం

హైదరాబాద్‌: విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ యువమోర్చ కార్యకర్తలు సచివాలయ ముట్టడికి యత్నించారు. విద్యార్థులపై ఫీజుల భారం పడకుండా చర్యలు తీసుకోవాలని, ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌కు త్వరగా షెడ్యూల్‌ క్రటించాలని డిమాండ్‌ చేశారు. సచివాలయ ప్రధానగేటువద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు.