విద్యాశాఖ మంత్రి పార్థ సారధిని పదవినుంచి తప్పించాలి:యూటీఎఫ్‌

హైదరాబాద్‌:  అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యాశాఖ మంత్రి పార్థసారధి పదవినుంచి తప్పించాలని. ఐక్క ఉపాధ్యాయ ఫెడరేషన్‌ డిమాండ్‌ వ్యక్తం  చేసింది. ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలు, సమస్యలు పరిష్కరించాలని బషీర్‌బాగ్‌లోని విద్యాశాఖ అధికారి కార్యలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరం రెండు సార్తు విద్యాపంక్షోత్సవాలు నిర్వహించి ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలు పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించటంలో విఫలమైందని విమర్శించారు. ఢిప్యూటీ, ఈవో, గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల ఉద్యోగాలను పదోన్నతులతో నింపాలని, ఎయిడెడ్‌ పాఠశాలలకు పుస్తకాలను అందజేయాలని డిమాండ్‌  వ్యక్తం చేశారు.