విద్యా ప్రమాణాలను మరింతగా మెరుగుపరచాల్సి ఉంది: ప్రణబ్‌

న్యూఢిల్లీ: మహోన్నతమైన జాతి నిర్మాణానికి విద్యా ప్రమాణాలను మరింతగా మెరుగుపరచాల్సి ఉందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బుధవారం ఢిల్లీలో నిర్వహించిన జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. దేశ బంగారు భవిష్యత్తునకు విద్యే కీలక భూమిక వహిస్తుందని స్పష్టం చేశారు. కొత్తకొత్త బోధనా విధానాలు, బోధనా ఉపకరణాలు నూతన తరాలను సమాజానికి మరింత ఉపయుక్తంగా తీర్చిదిద్దుతాయని తెలిపారు. విద్యా బోధనను కేవలం తరగతి గదులకే పరిమితం చేయరాదని సూచించారు.