విద్యా వ్యాపారాన్ని అరికట్టేందుకు ఉద్యమించాలి

విద్యా వ్యాపారాన్ని అరికట్టేందుకు విద్యార్థులు ఉద్యమించాలని ఎస్‌ఎఫ్‌టి జిల్లా అధ్యక్షుడు తాళ్ల సునిల్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం నర్సంపేట పట్టణంలోని ఆర్‌ అండ్‌ బి అతిథి గృహంలో ఎస్‌ఎఫ్‌టీీి ముఖ్య కార్యకర్తల సమావేశం ఆ సంఘం డివిజన్‌ ఉపాధ్యక్షుడు గడ్డం సదానందం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సునిల్‌ మాట్లాడుతూ విద్యా వ్యాపారాన్ని పూర్తి స్థాయిలో అడ్డుకునేందుకు విద్యార్థులు సమయత్నం కావాలన్నారు. ధనార్జేేనే ద్యేయంగా భావిస్తున్న ప్రైవేట్‌, కార్పోరేట్‌ విద్యా సంస్థలు విద్యా విలువలను మంటలో కలుపుతున్నాయని ఆవేధన వ్యక్తం చేశారు.హంగు ఆర్భాటాలతో విద్యార్థులను స్వేచ్చా పూరితమైన వాతావరణంలో ఉండనీయకుండా క్యాన్వసింగ్‌ల పేరుతో ఎన్నికల తరహ ప్రచారానికి పూనుకుంటున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. విద్యార్థుల స్వేచ్చకు ప్రైవేట్‌, కార్పోరేట్‌ విద్య సంస్థలే కళ్లేం వేస్తున్నాయని ధ్వజమెత్తారు. గ్రామాలలో ప్రైవేట్‌ విద్యా సంస్థలు బ్రోకర్లను తయారు చేసుకొని క్యాన్వాసింగ్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు అంకిత భావంతో విద్యనందించకుండా వ్యాపార దృక్పథంతోని మాత్రమే విద్యా బోధన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఇంటర్‌ బోర్డు అధికారులు ప్రైవేట్‌ విద్యా సంస్థల క్యాన్వాసింగ్‌ను అడ్డుకోవాలని సునిల్‌ కోవరు. ఈ సమావేశంలో ఆ సంఘం నాయకులు గడ్డం ప్రవీణ్‌, సదానందం, నరేష్‌, సతీష్‌, మేగం, భాస్కర్‌, నరేష్‌, రాజందర్‌, సుధాకర్‌, వెంకటేశ్‌, నిశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.