విద్యుత్తు పొదుపునకు కార్యాచరణ రాపొందించాలి: ప్రభుత్వ అంచనాల కమిటీ

హైదరాబాద్‌: విద్యుత్తు పొదుపు కోసం పటిష్ఠ కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వ అంచనాల కమిటీ ఆధికారులను ఆదేశించింది.ఛైర్మన్‌ ముత్యం రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కమిటీ రాష్ట్ర్లంలోని విద్యుత్‌ పరిస్థితిపై సమీక్షించింది, రోజూ 60 మిలియన్‌ యూనిట్ల లోటు ఉందని , ప్రభుత్వంపై 20 కోట్ల భారం పడుతోందని అధికారులు కమిటీకి నివేదించారు. విద్యుత్‌ పొదుపు చర్యలు పాటిస్తే ప్రభుత్వంపై భారం పడదని, వ్యవసాయ రంగంలో నాణ్యమైన పంపుసెట్లను ఉపయోగించడంతో పాటు విద్యుత్‌ దీపాలకు సౌరవిద్యుత్‌ దీపాలకు సౌరవిద్యుత్‌ ఉపయోగించాలని కమిటీ సూచించింది. వారం రోజుల్లోగా సమగ్ర నివేదిక అందించాలని కమిటీ అధికారులను ఆదేశించింది.