విద్యుత్తు సర్‌ ఛార్జిని రద్దు చేయాలని లోక్‌ సత్తా పోరు

విశాఖపట్నం: ప్రభుత్వం సామాన్యులపై విధించిన విద్యుత్తు సర్‌ఛార్జిని రద్దు చేయాలని లోక్‌సత్తా డిమాండ్‌ చేసింది. విద్యుత్తు నష్టాలను వూడ్చుకోవడంలో విఫలమైన ప్రభుత్వం ప్రజల నెత్తిన సర్‌ఛార్జి భారాన్ని  మోపడం అన్యాయమని, రాజకీయ పక్షాలు, స్వచ్ఛంధ సంస్థలతో కలిసి లోక్‌సత్తా దీనికి వ్యతిరేకంగా పోరాడు తుందని ఆపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భీశెట్టి బాజ్జీ చెప్పారు. లోక్‌సత్తా జిల్లా సమావేశంలో ఆయన  మాట్లాడుతూ దీనిపై పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయనున్నారని తెలియజేశారు. రానున్న స్థానిక ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ ఇప్పటికే  పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసిందని వివరించారు.

తాజావార్తలు