విద్యుత్‌ కోతతో పరిస్థితి అగమ్మగోచరం

గాజువాక:రాష్ట్రప్రభుత్వం కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సీపీఐ రాష్ట్రకార్యదర్శి నారాయణ అన్నారు.ప్రభుత్వ అసమర్ధత వల్లే వ్యాదులు వ్యాపిస్తున్నాయని ఆరోపించారు.ప్రజాసమస్యలు తెలుసుకోవడంలో భాగంగా సీపీఐ ఇచ్చిన పిలుపు మేరకు గాజువాక 61 వార్డు శ్రీనగర్‌లో కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు నారాయణ ఈ పాదయాత్రను ప్రారంబించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు విద్యుత్‌ కోతతో పారిశ్రామిక రంగం చిన్నవ్యాపారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని అన్నారు.జనావాసాల మద్య ఉన్న గోదాములు ఎత్తివేయాలని,ప్రాంతాల్లో గిరిజనలకు సౌకర్యాలు కల్పించాలని కోరారు.