విద్యుత్‌ కోతలపై ఫ్యాప్సి ఆందోళన

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌కోతలు తీవ్రం కావడంపై ఫ్యాప్సి ఆందోళన వ్యక్తం చేసింది. కోతలతో ఉత్పత్తులు అందివ్వలేకపోతున్నామని ఫ్యాప్సి పేర్కొంది. విద్యుత్‌ సరఫరాలో ప్రణాళిక లేకపోవడంతో పారిశ్రామిక ప్రగతి మందగిస్తోందని కోతలతో రాష్ట్రంలో పరిశ్రమలు మనుగడ అసాధ్యమని ఫ్యాప్సి తెలిపింది.