విద్యుత్‌ చార్జీలు తగ్గించే వరకు ఉద్యమం ఆపేదిలేదు

హైదరాబాద్‌: విద్యుత్‌ చార్జీలు తగ్గించేంత వరకు ఉద్యమం అగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. పది వామపక్షలు చేపట్టిన చలో సచివాలయం ముట్టడి సంధర్భంగా అరెస్ట్‌ అయిన రాఘవులును అరెస్ట్‌ చేసి అబిడ్స్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే ముఖ్యమంత్రి కావాలనే మమ్మల్ని అరెస్ట్‌ చేశారని విమర్శించారు. ఇతర పార్టీలు కూడా కలసి రావాలని పిలుపునిచ్చారు. సీఎం ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.