విద్యుత్‌ తీగలు తెగిపడి ఇద్దరి మృతి

ఒంగోలు: రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఒంగోలు పట్టణంలోని మస్తాన్‌ దర్గావద్ద విద్యుత్‌ తీగలు తెగిపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి కూరగాయల మార్కెట్‌కు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులపై విద్యుత్‌ తీగలు తెగిపడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఆ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం విద్యుత్‌ సిబ్బంది వచ్చి తీగలు తొలగించారు.