విద్యుత్‌ షాక్‌తో గేదె మృతి

కరీంనగర్‌: మహదేవ్‌పూర్‌ మండలంలోని కాళేశ్వరం క్షేత్రంలో సింగరేణి విశ్రాంతి గృహం వద్ద రక్షణ కంచెకు విద్యుత్‌ సరఫరా కావటంతో విద్యుదాఘాతంతో గేదె మృతి చెందినది. బొల్లం రాజయ్య అనే రైతు తన గేదెలను మందకు తోలుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్‌శాఖ అధికారులు కంచెకు విద్యుత: సరఫరాను నిలిపివేశారు.